కాబోయే సుప్రీం ప్రధాన న్యాయమూర్తిని కలిసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
Advertisement
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ రోజు ఢిల్లీలో జస్టిస్ ఎస్ఏ బాబ్డేతో భేటీ అయిన యార్లగడ్డ... ఆయనకు తెలుగు సాహిత్య చరిత్ర గ్రంధాలను బహూకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో అమరావతి, విశాఖపట్నంలను సందర్శించాలని ఈ సందర్భంగా యార్లగడ్డ కాబోయే ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దానికి జస్టిస్ బాబ్డే  సానుకూలంగా స్పందిస్తూ సమయానుకూలంగా వస్తానని హామీ ఇచ్చారు.
Fri, Nov 08, 2019, 04:08 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View