నగరిలో టీడీపీ ఓటమికి కారణం ఇదే: చంద్రబాబు
Advertisement
గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణానంతరం ఆలస్యం చేయకుండా అభ్యర్థిని ప్రకటించి ఉంటే నగరిలో టీడీపీ గెలిచేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన కుటుంబసభ్యుల ఒత్తిడితో అభ్యర్థి పేరును ప్రకటించడంలో ఆలస్యమైందని చెప్పారు. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులంతా కలుస్తారని భావించానని... కానీ, వారిలో వారే ఓటమి కోసం పని చేస్తారని ఊహించలేదని తెలిపారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే వారు శత్రువులను పెంచుకోవడం సరికాదని చెప్పారు. గాలి భాను ప్రకాశ్ కష్టపడితే మంచి నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు. గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి రోజా గెలుపొందిన సంగతి తెలిసిందే.
Fri, Nov 08, 2019, 03:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View