ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు!
Advertisement
ఏపీ ప్రభుత్వం కీలక పదవులను వరుసగా భర్తీ చేస్తోంది. తాజాగా, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాత్రికేయ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న దేవిరెడ్డి శ్రీనాథ్ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా పేరొందారు. 70వ దశకం చివరల్లో జర్నలిజం వృత్తిలో ప్రవేశించిన శ్రీనాథ్ ఆంధ్రప్రభ పత్రికతో ప్రస్థానం మొదలుపెట్టారు. అంతర్జాతీయంగా పేరొందిన బీబీసీ రేడియోకు కూడా ఆయన సేవలందించారు. ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా ప్రెసిడెంట్ గా రెండున్నర దశాబ్దాల పాటు కొనసాగారు. రాష్ట్రస్థాయిలో ఏపీయూడబ్ల్యూజే కార్యదర్శిగా వ్యవహరించారు. శ్రీనాథ్ కడప జిల్లా వాసే!
Fri, Nov 08, 2019, 03:41 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View