పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లు... కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
Advertisement
దేశంలో పెద్ద నోట్ల రద్దు అంశం ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యుడు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం అది. ప్రజాసంఘాలు, విపక్షాలు కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినా నోట్ల రద్దు నిర్ణయంపై ఎన్డీయే వెనక్కి తగ్గలేదు. పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లయిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. నోట్ల రద్దును ఆయన 'ఉగ్ర దాడి'గా అభివర్ణించారు.

నోట్ల రద్దు ఉగ్ర దాడికి మూడేళ్లు నిండాయని, ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ఆరోపించారు. ఎంతోమంది ప్రాణాలను హరించిన ఈ నిర్ణయం మరెందరినో నిరుద్యోగులుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిరు వ్యాపారాలు నోట్ల రద్దు కారణంగా ముగిసిపోయాయని అన్నారు. ఈ నోట్ల రద్దు ఉగ్ర దాడికి కారణమైన వారిని చట్టం ముందు దోషులుగా నిలపాల్సిన అవసరం ఉందన్నారు.
Fri, Nov 08, 2019, 03:06 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View