పారిస్ లో షూటింగ్ జరుపుకుంటున్న 'సామజ వర గమన'
Advertisement
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా 'అల వైకుంఠపురములో'. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన 'సామజ వర గమన' పాట ప్రేక్షకులను అలరించింది. సామాజిక మాధ్యమాలలో రికార్డులను సృష్టిస్తూ మోస్ట్ వాచ్డ్ సాంగ్ ఇన్ సౌత్ ఇండియాగా నిలిచింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీత దర్శకుడు తమన్ అందించిన బాణీలు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

 ఇక ఈ 'సామజ వర గమన'  సాంగ్ ను ప్రస్తుతం పారిస్‌లోని పలు అందమైన ప్రదేశాలలో చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై చిత్రీకరిస్తున్న ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ళ భరణి, సునీల్, నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్, బ్రహ్మాజీలు ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
Fri, Nov 08, 2019, 02:58 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View