గల్లా అశోక్ సరసన 'ఇస్మార్ట్' హీరోయిన్!
Advertisement
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, అశోక్ గల్లా తల్లి పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న చిత్రం ప్రారంభం కానుంది. కాగా, అశోక్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న చర్చకు తెరపడింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించనుంది. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో నిధి మంచి మార్కులే కొట్టేసింది.
Fri, Nov 08, 2019, 02:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View