'యాక్షన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు
Advertisement
తెలుగు .. తమిళ భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. అందువల్లనే అయన తమిళ చిత్రాలు తెలుగులోను విడుదలవుతుంటాయి. అలా తమిళంలో దర్శకుడు సుందర్ సి. రూపొందించిన 'యాక్షన్' సినిమా విడుదలకి ముస్తాబైంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించి, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈ నెల 9వ తేదీన ఇక్కడి 'దసపల్లా కన్వెన్షన్'లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. విశాల్ సరసన నాయికగా తమన్నా నటించగా, సీనియర్ హీరో రాంకీ .. ఐశ్వర్య లక్ష్మి .. ఛాయా సింగ్ .. కబీర్ దుల్హన్ సింగ్ .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 'అభిమన్యుడు'.. 'డిటెక్టివ్' చిత్రాల మాదిరిగానే, 'యాక్షన్'కి కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభించడం ఖాయమనే నమ్మకంతో విశాల్ వున్నాడు.
Fri, Nov 08, 2019, 09:46 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View