సరికొత్త 'సేనాపతి' ఇలా... స్పెషల్ లుక్ ను విడుదల చేసిన శంకర్!
Advertisement
సేనాపతి... శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు' చూసిన వారెవరికైనా గుర్తుండిపోయే పాత్ర అది. లంచగొండి తనంపై పోరాడే స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ నటన అద్భుతంగా సాగిందా చిత్రంలో. ఇక, తాజాగా ఆ సినిమాకు కొనసాగింపుగా భారతీయుడు-2 తీస్తున్న శంకర్, అందులోని సేనాపతి పాత్రకు సంబంధించిన స్పెషల్ లుక్ ను విడుదల చేశారు.

ఎత్తుగా కనిపిస్తున్న ఓ కోటపై నిలబడివున్న కమల్ ఇందులో కనిపిస్తుండగా, ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. తొలి భాగంలోని డ్రస్సింగ్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.
Fri, Nov 08, 2019, 09:16 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View