టాలీవుడ్ కు న్యూ హీరో... 10న మహేశ్ బాబు మేనల్లుడి సినిమా మొదలు!
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు తెలుగు సినీ తెరకు పరిచయం కానున్నాడు. కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నవంబర్ 10న కొత్త చిత్రం ప్రారంభం కానుంది. కృష్ణ కుమార్తె, గల్లా జయదేవ్ భార్య పద్మావతి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనుండగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పీఆర్వో బీఏ రాజు వెల్లడించారు. దీన్ని చూసిన ఘట్టమనేని ఫ్యాన్స్ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుతూ, అశోక్ కు అభినందనలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Thu, Nov 07, 2019, 11:49 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View