పాట చిత్రీకరణతో మొదలుకానున్న చిరూ మూవీ షూటింగ్
Advertisement
చిరంజీవి 152వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. డిసెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి షెడ్యూల్ షూటింగును పాట చిత్రీకరణతో మొదలు పెడుతున్నట్టుగా సమాచారం. ఆ దిశగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది ఇంట్రడక్షన్ సాంగ్ కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ప్రాచీన దేవాలయాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథ అని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నారు. ఒక కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది. మరో కథానాయిక ఎంపిక జరగవలసి వుంది. ఓ ముఖ్యమైన పాత్రలో ఈషా రెబ్బా కనిపించనుందని కూడా చెప్పుకుంటున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తారట.
Thu, Nov 07, 2019, 09:48 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View