రానాతో ప్రేమ వార్తలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్!
Advertisement
టాలీవుడ్ హీరో రానా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య లవ్ ఎఫైర్ ఉందన్న వార్తలు చానాళ్లుగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే, రానాతో తనకున్నది ప్రేమ కాదని, కేవలం స్నేహమేనని అంటోంది ఈ అమ్మడు. ప్రస్తుతం అవకాశాలు తగ్గి, స్పెషల్ ఫోటో సెషన్స్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రకుల్, తానే అవకాశాలు తగ్గించుకున్నానని చెబుతోంది.

ఇటీవల మీడియాతో మాట్లాడిన రకుల్, రానాకు, తనకు మధ్య ప్రేమ ఉందన్న వార్తలు అవాస్తవమని చెప్పింది. తామిద్దరి ఇళ్లు కేవలం రెండు నిమిషాల్లో వెళ్లేంత దగ్గరగా ఉంటాయని, తాను సినిమాలకు పరిచయం కాకముందు నుంచే రానా తెలుసునని చెప్పింది. ఇద్దరమూ ఎన్నడూ డేటింగ్ కు వెళ్లలేదని, రానా మరో యువతితో ప్రేమలో ఉన్నాడని రకుల్ వ్యాఖ్యానించారు. తాము స్నేహితులుగానే ఉన్నామని, రానా సహా తన హీరోలందరితో అలాగే ఉన్నానని అంది. ఇంతవరకూ తాను ఎవరితోనూ లవ్ లో పడలేదని, ఇంకా సింగిల్‌ గానే ఉన్నానని రకుల్ అంటోంది.
Thu, Nov 07, 2019, 08:28 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View