సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Advertisement
    *  అందాలతార రాశిఖన్నా తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో రాశి కథానాయికగా నటించింది. ఈ చిత్రం కోసం తొలిసారిగా డబ్బింగ్ చెప్పినట్టు రాశి వెల్లడించింది.
*  మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడుగా రూపొందుతున్న వార్ ఫిలిం 'మమంగళం' తెలుగు అనువాద హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 21న అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేస్తున్నారు.
*  పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నివేశాలను గోవాలో చిత్ర దర్శకుడు అనిల్ పాదూరి చిత్రీకరిస్తున్నాడు. మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. 
Thu, Nov 07, 2019, 07:22 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View