‘నిశ్శబ్దం’ వీడింది... అనుష్క కొత్త సినిమా టీజర్ వచ్చేసింది!
Advertisement
సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ గా తెరకెక్కించిన ‘నిశ్శబ్దం’ చిత్రం టీజర్ ను విడుదల చేశారు.  ప్రముఖ హీరోయిన్ అనుష్క ఈ చిత్రంలో విభిన్న పాత్రను పోషించారు. దివ్యాంగురాలిగా కనిపించారు. ‘విహారయాత్ర పీడకలైందని’ టీజర్ లో అనుష్క అంటున్న దృశ్యాలున్నాయి. రేపు పుట్టినరోజు జరుపుకోనున్న అనుష్కకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ ఒకరోజు ముందుగా ఈ టీజర్ ను విడుదల చేశారు.

‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తుండగా, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, షాలినిపాండే, అంజలి, సుబ్బరాజు తదితరులు ముఖ్యమైన తారాగణం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుందని నిర్మాత వెల్లడించారు.

Wed, Nov 06, 2019, 06:47 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View