ఇకపై అలా చేయనంటున్న అనూ ఇమ్మాన్యుయేల్
Advertisement
తెలుగు తెరకి కొత్త అందాన్ని పరిచయం చేసిన కథానాయికలలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో ఈ సుందరి 'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ రావడంతో పవన్ 'అజ్ఞాతవాసి' .. బన్నీ 'నా పేరు సూర్య' వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది.

అయితే దురదృష్టవశాత్తు ఆ రెండు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో సహజంగానే అవకాశాలు ముఖం చాటేశాయి. అయితే అమ్మడు ఇప్పుడు రియలైజ్ అయిందట. కథల విషయంలో పెద్దగా దృష్టి పెట్టకుండా ఓకే చెప్పేస్తూ వెళ్లడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని సన్నిహితుల దగ్గర వాపోతోందట. మళ్లీ తెలుగు నుంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందనీ, ఈ సారి కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని, తానేమిటనేది నిరూపిస్తాననే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోందట.
Wed, Nov 06, 2019, 05:36 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View