ఇకపై పారితోషికం పెంచుతానేమో: హీరో శ్రీవిష్ణు
Advertisement
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ కారణంగానే యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఒక్కో సినిమాకి తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్న శ్రీవిష్ణు, 'బ్రోచేవారెవరురా' సినిమాతో భారీ విజయాన్నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసిన 'తిప్పరా మీసం' .. ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'బ్రోచేవారెవరురా' విజయం తరువాత పారితోషికం పెంచారా?' అనే అంతా అడుగుతున్నారు. ఆ సినిమాకి ముందే నేను నాలుగు సినిమాలు కమిట్ అయ్యాను. అందువలన పారితోషికం పెంచమని వాళ్లను అడగలేను. ఈ మూడు ప్రాజెక్టుల తరువాత చేసే సినిమాలకి పారితోషికం పెంచుతానేమో" అన్నాడు. ఇక తన తాజా చిత్రమైన 'తిప్పరా మీసం' తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
Wed, Nov 06, 2019, 04:16 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View