‘చూసి చూడంగానే’ టీజర్ విడుదల
Advertisement
‘చూసి చూడంగానే’ చిత్రం టీజర్ సామాజిక మాధ్యమాల్లో అభిమానులను ఆకట్టుకుంటోంది.  హీరోగా పరిచయమవుతున్న నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ ఈ టీజర్ లో కనిపిస్తూ ‘ అవును.. ఇది మెకానికల్ క్లాస్ రూమేనా?’ అని తన స్నేహితుడితో అనగా, జవాబుగా స్నేహితుడు ‘వాళ్లను చూశావా, పాత డబ్బింగ్ చిత్రాల్లో హీరోయిన్ తరహాలో ఎలా ఉన్నారో.. మెకానికల్ లో అమ్మాయిలు అలాగే ఉంటారు’ అని చెబుతాడు.

ఈ చిత్రంలో హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయి మాళవిక పరిచయం కానుంది. గోపీ సుందర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ధర్మపద క్రియేషన్స్ బ్యానర్ పై దీనిని రాజ్ కందుకూరి నిర్మిస్తుండగా, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
Wed, Nov 06, 2019, 04:15 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View