'ఆదిత్య వర్మ' విడుదల తేదీ ఖరారు
Advertisement
తెలుగులో 'అర్జున్ రెడ్డి' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇదే సినిమాను హిందీలో రీమేక్  చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలో 'ఆదిత్య వర్మ' టైటిల్ తో రీమేక్ చేశారు. సీనియర్ హీరో విక్రమ్ తనయుడు 'ధృవ్' ఈ సినిమా ద్వారా వెండితెరకి హీరోగా పరిచయమవుతున్నాడు.  ఆయన జోడీగా 'బనిత సంధు' నటించింది.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. గిరీశాయ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై, తమిళనాట భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో ధృవ్ తో కలిసి విక్రమ్ కూడా పాల్గొంటున్నారు. తొలి ప్రయత్నంలోనే ధృవ్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
Wed, Nov 06, 2019, 03:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View