అంచనాలు పెంచుతున్న 'రాగల 24 గంటల్లో' ట్రైలర్
Advertisement
'ఢమరుకం' శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 'రాగల 24 గంటల్లో' సినిమా రూపొందింది. ఈషా రెబ్బా ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా నిర్మితమైంది. సత్యదేవ్ - శ్రీరామ్ - గణేశ్ వెంకట్రామన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక జంట కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం .. అక్కడ ఆ భర్త హత్య జరగడం .. పోలీసుల విచారణ .. తన భర్తను తనే చంపేశానని ఆ భార్య అంగీకరించడం ఈ ట్రైలర్లో చూపించారు. ఆమె చెప్పేది నిజమేనా? అందుకు కారణాలేమై ఉంటాయి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ముగించారు. ఈ ట్రైలర్ తో అంచనాలు పెంచడంలో ఈ సినిమా టీమ్ సక్సెస్ అయిందనే చెప్పాలి.
Wed, Nov 06, 2019, 12:55 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View