బాలుడు 'ఆంటీ' అని పిలిచాడంటూ.. కోపంతో దుర్భాషలాడిన బాలీవుడ్ నటి.. వీడియో వైరల్
Advertisement
గతంలో ఓ బాలుడు తనను 'ఆంటీ' అని పిలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆమె దుర్భాషలాడిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరకు ఆమెపై 'నేషనల్ కమిషన్  ఫర్  ప్రొటెక్షన్ ఆఫ్  చైల్డ్  రైట్స్'కు ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఇటీవల ఆమె  'సన్ ఆఫ్ అభిష్'  అనే షోలో పాల్గొంది. సినీ రంగంలోకి ప్రవేశించాక ఎదురైన అనుభవాలను చెప్పింది. తన కెరీర్  ఆరంభంలో ఓ ప్రకటనలో నటించానని, ఆ సమయంలో ఓ బాలనటుడు తనను ఆంటీ అన్నాడని చెప్పింది. షోలో అతడిని బాగా తిట్టింది.

ఆ సమయంలో తాను నిరాశకు గురయ్యానని స్వరా భాస్కర్ చెప్పింది. పిల్లలు దయ్యాలతో సమానమని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే, షోలో ఇలా ఆమె దుర్భాషలాడడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా స్వరా భాస్కర్ ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ వైపు బుద్ధులు చెబుతూ, మరోవైపు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
Wed, Nov 06, 2019, 12:45 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View