'పింక్' రీమేక్ కోసం పవన్ పారితోషికం 40 కోట్లు?
Advertisement
హిందీలో ఆ మధ్య విడుదలైన 'పింక్' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇదే సినిమాను తమిళంలో అజిత్ కథానాయకుడిగా రీమేక్ చేయగా, అక్కడ కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి దిల్ రాజు రంగంలోకి దిగాడు. బోనీకపూర్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయకుడిగా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పవన్ అందుకోనున్న పారితోషికం గురించిన చర్చలు ఫిల్మ్ నగర్లో జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమాకి పారితోషికంగా ఆయన 40 కోట్లను అందుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి.
Wed, Nov 06, 2019, 12:20 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View