'ఏయ్! నన్ను టచ్ చేయకు.. నేనిప్పుడు గొప్ప సెలబ్రిటీని..' అభిమానిని కసురుకున్న రేణూ మోండల్.. వీడియో వైరల్
Advertisement
రైల్వే స్టేషన్‌లో కూర్చొని పాటలు పాడుకునే స్థాయి నుంచి బాలీవుడ్‌ గాయనిగా ఎదిగిన రేణూ మోండల్ గుర్తుందిగా?  పశ్చిమ బెంగాల్‌లోని రణఘాట్‌ రైల్వే స్టేషన్‌ లో తియ్యటి స్వరంతో  'ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై' అనే పాట పాడగా.. ఆమె పాటను వీడియో తీసి ఒకరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఆమెకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. ఇప్పుడు తాను సెలబ్రిటీనని ఆమె ఫీల్ అవుతున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో ఆమె ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేసింది.

ముంబయిలోని ఓ షాపింగ్ మాల్ లో రేణూ మోండల్ ను చూసిన  ఓ మహిళ ఆమె వద్దకు వచ్చింది. ఆమెతో సెల్ఫీ దిగాలని అనుకుంది. ఆమె భుజంపై చెయ్యి వేసి పిలిచింది. దీంతో రేణూ మోండల్ కు కోపం వచ్చేసింది. తన భుజంపై చెయ్యి ఎందుకు వేస్తున్నావంటూ ప్రశ్నించింది. తానిప్పుడు సెలబ్రిటీనని దూరంగా ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆమెపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 'పాతరోజులని మర్చిపోయి ఆమె ప్రవర్తిస్తోన్న తీరు బాగోలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమెకు పొగరు వచ్చిందని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
Wed, Nov 06, 2019, 11:48 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View