'ఈనాడు' సినిమాపై కృష్ణగారికి డౌట్ ఉండేది: పరుచూరి గోపాలకృష్ణ
Advertisement
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'ఈనాడు' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'ఈనాడు' సినిమా సమయానికి మేము ఎవరనేది జనానికి తెలియదు. ఆ సినిమాపై కృష్ణగారికి సందేహం ఉండేది. 'నాకు హీరోయిన్ లేదు .. డ్యూయెట్లు లేవు .. నాతో రిస్క్ చేయించారు' అని ఆయన అనేవారు. ఈ కారణంగా ఈ సినిమా ఆడుతుందో .. లేదో అనే ఒక డౌట్ ఆయనకి ఉండేది.

విడుదల రోజున ఆయనతో పాటు మేము కూడా విజయవాడలో ఈ సినిమాకి వెళ్లాము. క్లైమాక్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ చూసి ఆయన మమ్మల్ని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడి నుంచి గుంటూరులోని థియేటర్ కి వెళ్లాము. అక్కడ ఆది శేషగిరిరావుగారు మాట్లాడుతూ, ఈ సినిమాకి 'మాటలు' రాసింది వీరే అని ఆడియన్స్ కి మమ్మల్ని చూపించారు. అంతే .. అభిమానంతో వాళ్లంతా మా మీద పడిపోయారు. అదొక తీపి జ్ఞాపకం అంతే" అని చెప్పుకొచ్చారు.
Wed, Nov 06, 2019, 09:51 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View