'జాన్' సినిమా కోసం సిద్ధమవుతున్న ప్రభాస్
Advertisement
'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'జాన్' సినిమా రూపొందుతోంది. తొలి షెడ్యూల్ ను ఆ మధ్య ఇటలీలో షూట్ చేశారు. 'సాహో' కారణంగా రెండవ షెడ్యూల్ ఆలస్యమైంది. 'సాహో' ఫలితం తరువాత 'జాన్' కథలో ప్రభాస్ మళ్లీ మార్పులు సూచించడం వలన మరికొంత లేట్ అయిందని అంటారు.

మొత్తానికి 'జాన్' రెండవ షెడ్యూల్ కి డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో, ప్రభాస్ తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కృష్ణంరాజు .. యూవీ క్రియేషన్స్ వారు కలిసి నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో కనిపించనుందనే సంగతి తెలిసిందే.
Wed, Nov 06, 2019, 09:24 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View