డేటింగ్ కు పిలిచా.. కానీ రానంది!: పునర్నవి గురించి రాహుల్ సిప్లిగంజ్
Advertisement
‘బిగ్ బాస్ సీజన్ -3’ లో పాల్గొన్న నటి పునర్నవికి, విజేతగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ కు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న వార్తలు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినవచ్చాయి. ఈ నేపథ్యంలో వీటిపై రాహుల్ స్పందించారు. పునర్నవితో తనకు ఎలాంటి రొమాంటిక్ సంబంధం లేదన్నారు.  

‘ఆమెను డేటింగ్ కు పిలిచా. కాని ఆమె రానంది. ఆమె జీవితంలో మరో వ్యక్తి ఉన్నారు. పునర్నవి అంటే నాకు గౌరవముంది. మేమిద్దరం మంచి స్నేహితులం. ఈ షో నాకు చాలా నేర్పింది. వ్యక్తిగత ప్రవర్తన, సహనంతో ఉండటం వంటి అంశాలపై అవగాహన ఏర్పడింది. బహుమతిగా వచ్చిన రూ.50లక్షలతో మంచి ప్లాట్ కొంటాను. ఓట్లేసి గెలిపించిన అభిమానులకందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
Tue, Nov 05, 2019, 08:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View