ఈ రూమర్లు ఏమిటో.. అసలు సూర్య, అజిత్ లకు నేను కథే చెప్పలేదు!: మురుగదాస్
Advertisement
సినీ హీరోలు సూర్య, అజిత్ లతో సినిమా చేసే విషయం ఖరారు కాలేదని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటించిన ‘దర్బార్’ చిత్రం నిర్మాణానంతర పనుల్లో  బిజీగా ఉన్నానన్నారు. కాగా, ఇటీవల హీరో సూర్యకు ఓ కథ చెప్పగా ఆయన అంగీకరించడంతో సినిమా షూటింగ్ ప్రారంభమయిందని వార్తలు వచ్చాయి. మరోవైపు ఇంకో కథను హీరో అజిత్ కు వినిపించగా ఆయన కూడా ఓకే చేశారని, ఫలితంగా సూర్యతో నిర్మించే చిత్రాన్ని ఆపేశారని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు వెల్లువెత్తాయి.

ఆఖర్లో అజిత్ నిరాకరించడంతో మళ్లీ సూర్య వద్దకే వెళ్లారని, ఆయన ఈసారి నో చెప్పారని కూడా మురుగదాస్ పై కథనాలు వినిపించాయి. వీటిపై మురుగదాస్ స్పందిస్తూ.. అవన్నీ పుకార్లని కొట్టి పారేశారు. ఈ రూమర్లు ఏమిటో, ఎవరు పుట్టించారో తెలియదని, కథ వినిపించడానికి సూర్య, అజిత్ లను అసలు కలవనేలేదని స్పష్టం చేశారు. వారితో సినిమా చేసే విషయం ఖరారు కాలేదని తెలిపారు.
Tue, Nov 05, 2019, 07:47 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View