శ్రీవిష్ణు పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి: 'తిప్పరా మీసం' దర్శకుడు
Advertisement
తెలుగులో 'అసుర' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ విజయ్, తాజాగా 'తిప్పరా మీసం' సినిమాను రూపొందించాడు. శ్రీవిష్ణు కథానాయకుడిగా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో కృష్ణ విజయ్ మాట్లాడుతూ .."ఇది మదర్ సెంటిమెంట్ తో ముడిపడిన కథ. తల్లి కోసం హీరో ఏం చేశాడనే దిశగా ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు .. ఒక పబ్ లో డీజేగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది .. పాజిటివ్ గా ముగుస్తుంది. శ్రీవిష్ణు చేసిన ఈ పాత్ర ఆయన కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనీ .. ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనే నమ్మకం వుంది" అని అన్నాడు.
Tue, Nov 05, 2019, 03:14 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View