ఆ సినిమా ఫంక్షన్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది: రాఘవేంద్రరావు
Advertisement
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ, రమ్యకృష్ణను గురించి ప్రస్తావించారు. రమ్యకృష్ణపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్పుడు, వాళ్ల పేరెంట్స్ నా దగ్గర చాలా బాధపడ్డారు. 'అల్లుడు గారు' సినిమాలో రమ్యకృష్ణకి కథానాయికగా అవకాశం ఇచ్చాను. ఈ సినిమాలోని 'ముద్దబంతి నవ్వులో' అనే ఒకే ఒక్క పాటతో రమ్యకృష్ణ క్రేజ్ పెరిగిపోయింది.

ఆ తరువాత 'అల్లరి మొగుడు' సినిమాలోను ఆమెకి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా ఫంక్షన్లో రమ్యకృష్ణ ఏడ్చేసింది. తనకి గల ఐరన్ లెగ్ అనే ముద్రను నేను తుడిచేశానంటూ కన్నీళ్లు పెట్టుకుంది. 'ఎవరైతే నిన్ను ఐరన్ లెగ్ అంటున్నారో వాళ్లంతా నీ డేట్స్ కోసం వెయిట్ చేసే రోజొకటి వస్తుందని నేను రమ్యకృష్ణకి ముందుగానే చెప్పాను. అన్నట్టుగానే ఆ తరువాత ఆమె స్టార్ హీరోయిన్ గా బిజీ అయింది" అని చెప్పుకొచ్చారు.
Tue, Nov 05, 2019, 01:37 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View