కొత్త సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టిన వీడియోను పోస్ట్ చేసిన సల్మాన్ ఖాన్!
Advertisement
ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ‘రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైంది. ప్రస్తుతం స్టూడియోలో వేసిన సెట్స్ లో ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. తన కొత్త సినిమా సెట్స్ లోకి వెళ్తోన్న సమయంలో తీసిన వీడియోను సల్మాన్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. స్లో మోషన్ లో సెట్స్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఆయన కనపడుతున్నాడు. అయితే, తన ముఖ భాగాన్ని మాత్రం ఆయన చూపించలేదు.

ఈ సినిమాలోని ఈ ప్రారంభ సీన్ ఓ రెస్టారెంటు సెట్స్ లో ఉంటుందని ఈ వీడియోను బట్టి అర్థమవుతోంది. 'రాధే ఈద్2020.. తొలిరోజు' అంటూ సల్మాన్ ఖాన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అలాగే, నిన్న చిత్రీకరించిన ముహూర్తపు షాట్ క్లాప్ కొట్టిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు.

సల్మాన్ తో పాటు ఈ సినిమాలో దిశా పటానీ, రణ్ దీప్ హూడా ప్రధానపాత్రల్లో  నటిస్తున్నారు. ప్రభుదేవా, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో ఇప్పటికే వాంటెడ్ సినిమా వచ్చింది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సల్మాన్ 'దబాంగ్ 3' సినిమా వచ్చేనెల 20న విడుదల కానుంది. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు.   
Tue, Nov 05, 2019, 12:43 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View