మరో నెల రోజుల తరువాతనే సెట్స్ పైకి రానా
Advertisement
వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' రూపొందుతోంది. రానా .. సాయిపల్లవి జంటగా ఈ సినిమా నిర్మితమవుతోంది. 1990 ప్రాంతంలో వరంగల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగు మొదలుపెట్టిన తరువాత, రానా అమెరికా వెళ్లి కొన్నాళ్లు అక్కడ వుండి వచ్చాడు. కొంతకాలంగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఈలోగా సాయిపల్లవి .. ఇతర ముఖ్యమైన ఆర్టిస్టుల కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రానాకి సంబంధించిన పోర్షన్ మాత్రమే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి రానా సెట్స్ పైకి వస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. కానీ రానా మరో నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోనున్నాడనేది తాజా సమాచారం. డిసెంబర్ 1 తరువాత ఆయన సెట్స్ పైకి రావొచ్చని అంటున్నారు.
Tue, Nov 05, 2019, 11:45 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View