'అల్లరి ప్రియుడు' ఫ్లాప్ కావడం ఖాయమన్నారు: రాఘవేంద్రరావు
Advertisement
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ హిట్ చిత్రాల జాబితాలో 'అల్లరి ప్రియుడు' ఒకటిగా కనిపిస్తుంది. అలాంటి ఈ సినిమాను గురించి తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావించారు. 'అల్లరి ప్రియుడు' కథ రాజశేఖర్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిందే. 'రాజశేఖర్ తో లవ్ స్టోరీ ఏంటీ .. డాన్సులు ఏంటి.. ఈయనకి ఏమైంది?' అని కొంతమంది అనుకున్నారు.

ఈ సినిమా విడుదలైన తరువాత ఆంధ్ర నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ కాల్ చేశాడు. 'రాజశేఖర్ కి ఆ కాస్ట్యూమ్స్ ఏంటి .. ఆ పాటలేంటి .. ఆ స్టెప్పులేంటి .. మీకు ఏదో అయింది .. ఈ సినిమాతో దుకాణం మూసేయవలసిందే' అన్నాడు. ఆయన అలా అన్నందుకైనా ఆ సినిమా బాగా ఆడాలని దేవుణ్ణి కోరుకునేవాడిని. 2వ వారం నుంచి వసూళ్లు పుంజుకున్నాయి .. 25 వారాలపాటు ఆడింది. ఆ ఫంక్షన్ కి సంబంధించిన మొదటి ఇన్విటేషన్ కార్డు ఆయనకే పంపించాను" అని చెప్పుకొచ్చారు.
Tue, Nov 05, 2019, 11:17 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View