'బిగిల్' పై ఆధిపత్యాన్ని సాధిస్తున్న 'ఖైదీ'
Advertisement
విజయ్ కథానాయకుడిగా దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళనాట 'బిగిల్' భారీస్థాయిలో విడుదలైంది. అదే రోజున తెలుగులోనూ ఈ సినిమా 'విజిల్' పేరుతో ప్రేక్షకులను పలకరించింది. కార్తీ కథానాయకుడిగా 'ఖైదీ' కూడా అదే రోజున విడుదలైంది. విజయ్ కి గల క్రేజ్ కారణంగా 'బిగిల్' భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఇక పెద్దగా అంచనాలు లేని 'ఖైదీ' మౌత్ టాక్ తో ఊపందుకుంది.

అయితే రాన్రాను థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలో 'బిగిల్' ను 'ఖైదీ' బీట్ చేసిందని చెబుతున్నారు. ఈ నెల 1 నుంచి 3 తేదీ వరకూ పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా వున్న మల్టీ ప్లెక్స్ లలో 'బిగిల్' 68 శాతం ఆక్యుపెన్సీకి పరిమితం కాగా, 'ఖైదీ' 74 శాతం ఆక్యుపెన్సీని సాధించడం విశేషం. ఇక తెలుగు వెర్షన్ విషయానికొస్తే, 'విజిల్' 47 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉండగా, 'ఖైదీ' 66 శాతం ఆక్యుపెన్సీని కలిగివుంది. 'బిగిల్' భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా కాగా, 'ఖైదీ' చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమా కావడం విశేషం.
Tue, Nov 05, 2019, 09:29 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View