ఇండిగో ఎయిర్ లైన్స్ పై బాలీవుడ్ నటి సోనాక్షి రుసరుసలు!
Advertisement
సేవా తత్పరత లోపించిందని, ఇటీవల పలువురు సెలబ్రిటీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోపై తాజాగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా విరుచుకుపడ్డారు. ఎంతో గట్టిదైన తన ట్రాలీ బ్యాగ్ ను విరిచేసి అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమాన ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. తన ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్, చక్రాలు ఊడగొట్టారని పేర్కొంటూ, ఫొటోలను కూడా పెట్టారు.

‘ఈరోజు ఇండిగో విమానంలో ప్రయాణించా. పర్ ఫెక్ట్ గా ఉన్న బ్యాగ్ తో నా ప్రయాణం ప్రారంభించాను. ప్రయాణం అనంతరం ఒక చక్రం ఊడగొట్టి, పూర్తిగా విరిగిపోయిన హ్యాండిల్ తో ఉన్న ట్రాలీ బ్యాగ్ ను నాకు అప్పగించారు. ధన్యవాదాలు ఇండిగో!’ అని తన సందేశంలో పేర్కొన్నారు. లగేజి పట్ల ఇండిగో సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన వీణను సిబ్బంది పాడుచేశారని ప్రముఖ సంగీత కళాకారుడు శభేంద్ర రావు ఫేస్ బుక్ మాధ్యమంగా విమర్శించిన సంగతి తెలిసిందే.
Mon, Nov 04, 2019, 08:33 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View