'ప్రతిరోజూ పండగే' నుంచి ఫస్టు సింగిల్ వచ్చేసింది
Advertisement
మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా 'ప్రతిరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. సత్యరాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదిలారు.

"మెరిశాడే మెరిశాడే పసివాడై మెరిశాడే .. మురిశాడే మురిశాడే సరదాలో మునిగాడే .." అంటూ ఈ పాట సాగుతోంది. బంధాలు .. అనుబంధాల విలువలను చాటుతూ, అందరూ కలిసుండటమే అసలైన పండగ అనే అర్థం వచ్చేలా ఈ పాట సాగుతోంది. తమన్ సంగీతం .. కెకె సాహిత్యం .. శ్రీకృష్ణ ఆలాపన బాగున్నాయి. భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
Mon, Nov 04, 2019, 05:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View