ఓంకార్ దర్శకత్వంలో 'అసురన్' తెలుగు రీమేక్?
Advertisement
ధనుశ్ కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన 'అసురన్' తమిళనాట భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రితం నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా, ధనుశ్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వెంకటేశ్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ - కలైపులి థాను సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి బయటికి వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిని కూడా సెట్ చేశారనేది తాజా సమాచారం. 'రాజుగారి గది 3' దర్శకుడు ఓంకార్ కి 'అసురన్' తెలుగు రీమేక్ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సురేశ్ బాబుకి - ఓంకార్ కి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.
Mon, Nov 04, 2019, 03:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View