250 కోట్ల క్లబ్ లో చేరిపోయిన 'బిగిల్'
Advertisement
విజయ్ హీరోగా రూపొందిన 'బిగిల్' దీపావళి కానుకగా క్రితం నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే రోజున 'విజిల్' టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన 'బిగిల్' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

10 రోజుల్లో ఈ సినిమా తమిళనాట 118 కోట్లను వసూలు చేయగా, తెలుగు రాష్ట్రాల్లో 17.30 కోట్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 10 రోజుల్లో 250.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అయితే ఈ సినిమా లాభాల బాట పట్టడానికి మరికొన్ని రోజులు థియేటర్స్ లో నిలబడవలసి వుంది. మరో వైపున విజయ్ తన తాజా చిత్రం కోసం రంగంలోకి దిగిపోయాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది.
Mon, Nov 04, 2019, 03:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View