విడుదలకి సిద్ధమైన 'తిప్పరా మీసం'
Advertisement
కృష్ణ విజయ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా 'తిప్పరా మీసం' రూపొందింది. రిజ్వాన్ నిర్మించిన ఈ సినిమాలో నిక్కీ తంబోలి కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాను గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ , "దర్శకుడు కృష్ణ విజయ్ నా పాత్రను గురించి చెప్పినప్పుడు, నాలో ఆయనకి ఈ యాంగిల్ కనిపించిందా? అని అనుకున్నాను. అవుట్ పుట్ చూశాక నాతోనే ఆయన ఈ పాత్రను ఎందుకు చేయించారనేది అర్థమైంది. ఈ సినిమాలో తల్లి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆ పాత్రను రోహిణి గారు పోషించారు. ఇలా మదర్ సెంటిమెంట్ వున్న సినిమాలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
Mon, Nov 04, 2019, 02:33 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View