'పవర్' అంటూ పూనమ్ కౌర్ మరో ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్ అభిమానులు
Advertisement
కోపాన్ని ప్రదర్శించడం శక్తికి సూచిక కాదు అనేలా టాలీవుడ్ నటి పూనం కౌర్ ట్వీట్ చేసి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.  పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ ఆమె కొంత కాలంగా ట్వీట్లు చేస్తోంది. నిన్న విశాఖ పట్నంలో పవన్  లాంగ్ మార్చ్ లో పాల్గొని అనంతరం ఉద్వేగభరింగా ప్రసంగించారు.

ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఈ రోజు మరో ట్వీట్ చేసింది. 'ఆగ్రహం అంటే పవర్ కాదు' అని ఆమె పేర్కొంది. దీంతో 'పవర్' స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆమెను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. వైసీపీకి ఎప్పుడు అమ్ముడుబోయావు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. 'నీకు బుద్ధి ఉంటే ఎవరి గురించి ట్వీట్ చేస్తున్నావో వారి పేర్లను కూడా రాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'బాగా చెప్పారు మేడం. అయితే, మీ ట్వీట్ లో తీవ్రత కాస్త తగ్గింది' అని మరొకరు వ్యాఖ్యానించారు. 
Mon, Nov 04, 2019, 01:04 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View