హాకీ నేపథ్యంలో సాగే కథతో 'A1 ఎక్స్ ప్రెస్'
Advertisement
సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో సందీప్ కిషన్ వున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.

డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్నాడు. హాకీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. సందీప్ కిషన్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి 'A1 ఎక్స్ ప్రెస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజునే ఈ సినిమా షూటింగును మొదలుపెట్టారు. సందీప్ కిషన్ జోడీగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. ఆమె కూడా ఈ సినిమాలో హాకీ ప్లేయర్ గా కనిపించనుండటంతో శిక్షణ తీసుకుంటోందట. హాకీ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
Mon, Nov 04, 2019, 12:33 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View