'నిశ్శబ్దం' నుంచి టీజర్ వస్తోంది
Advertisement
నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను భుజాన వేసుకుని సమర్థవంతంగా నడిపించడంలో అనుష్క సిద్ధహస్తురాలు. ఈ విషయాన్ని 'భాగమతి' వరకూ ఆమె చేసిన సినిమాలు నిరూపించాయి. ఈ సారి కూడా ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన కథతోనే ప్రేక్షకులను పలకరించనుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన 'సైలెన్స్' సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

తెలుగులో 'నిశ్శబ్దం'అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి టీమ్ సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 5 గంటలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టీజర్ తో మరింతగా అంచనాలు పెంచడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రకారిణిగా అనుష్క కనిపించే ఈ సినిమాలో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే ముఖ్యమైన పాత్రలను పోషించారు.
Mon, Nov 04, 2019, 11:30 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View