కేరళకు మహేశ్ బాబు అండ్ టీమ్
Advertisement
మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ ముందుగా వేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం చకచకా జరిగిపోతోంది. రీసెంట్ గా ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను కేరళలో ప్లాన్ చేసినట్టుగా అనిల్ రావిపూడి చెప్పాడు. ఆల్రెడీ ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరినట్టు సమాచారం. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు, ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.  విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాను, జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.
Mon, Nov 04, 2019, 11:07 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View