వినాయక్ తో తలపడేందుకు విలన్ రెడీ
Advertisement
మాస్ యాక్షన్ కి కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి, అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం వినాయక్ ప్రత్యేకత. అలాంటి వినాయక్ 'శీనయ్య' సినిమాతో హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. క్రితం నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. 'శరభ' ఫేమ్ నరసింహ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నవీన్ చంద్రను తీసుకున్నారనేది తాజా సమాచారం. హీరోగా తన కెరియర్ ను ప్రారంభించిన నవీన్ చంద్ర .. కీలకమైన పాత్రలతో పాటు విలన్ పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. 'అరవింద సమేత'లో విలన్ గా చేసిన నవీన్ చంద్ర, 'ఎవరు' సినిమాలోను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మెప్పించాడు. 'శీనయ్య' సినిమాలోను ఆయన విలన్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు.
Mon, Nov 04, 2019, 10:14 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View