'అల వైకుంఠపురములో' నుంచి టబు ఫస్టులుక్
Advertisement
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా 'టబు' ఒక వెలుగు వెలిగింది. నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లోనూ తన సత్తాను చాటి చెప్పింది. కొంత కాలంగా ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. ఈ రోజున ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'అల వైకుంఠపురములో' టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,
ఈ సినిమా నుంచి ఆమె ఫస్టులుక్ ను వదిలారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో .. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రీమంతురాలైన 'అలకనందాదేవి' పాత్రలో టబు కనిపించనుంది. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా వుండనున్నట్టు సమాచారం. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Mon, Nov 04, 2019, 09:45 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View