మెగాస్టార్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందట!
Advertisement
తెలుగు తెరపై నిలదొక్కుకున్న అతికొద్ది మంది కథానాయికలలో ఈషా రెబ్బా ఒకరు. చక్కని కనుముక్కు తీరుతో ఈ అమ్మాయి కుర్రకారు మనసులను దోచేసుకుంది. అవకాశాలు ఒక్కసారిగా వచ్చేసి మీదపడకపోయినా, ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ సుందరికి, ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ తగిలిందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల ఒక సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ఈషా రెబ్బాను తీసుకోవడం జరిగిందని అంటున్నారు. ఆ పాత్ర ఏమిటి? దాని తీరు తెన్నులు ఎలాంటివి? అనేది త్వరలో తెలిసే అవకాశాలు వున్నాయి. ఈ సినిమాతోనైనా ఈషా రెబ్బా దశ తిరుగుతుందేమో చూడాలి.
Mon, Nov 04, 2019, 09:27 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View