సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
  *  పవన్ కల్యాణ్ హీరోగా 'పింక్' హిందీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా నయనతారను ఎంపిక చేసే అవకాశం వుంది.
*  సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. 'ఏ1ఎక్స్ ప్రెస్' పేరిట రూపొందే ఈ చిత్రంలో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే హాకీ ఆటలో ఆమె శిక్షణ తీసుకుంటుందట.
*  నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఉగాదికి అంటే మార్చ్ 25న దీనిని విడుదల చేయడానికి నిర్ణయించారు. సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
Mon, Nov 04, 2019, 07:28 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View