'బిగ్ బాస్ విజేత శ్రీముఖి' అంటూ వస్తున్న వార్తపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున
Advertisement
తెలుగు బిగ్ బాస్ సీజన్-3 తుది అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేసింది. టైటిల్ పోరులో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి నిలవగా.. 'ఈ సీజన్ విజేత శ్రీముఖి' అనే వార్తతో పాటు ఇందుకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు రాహుల్ గెలిచాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ వ్యాఖ్యాత నాగార్జున స్పందించారు.

'బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ షో విజేతపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మొద్దు. విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమం చూసి తెలుసుకోండి' అని ట్విటర్‌ ద్వారా నాగార్జున తెలిపారు. మరి కొన్ని గంటల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది.


Sun, Nov 03, 2019, 11:17 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View