'ప్రతిరోజూ పండగే'నుంచి ఫస్టు సింగిల్ వచ్చేస్తోంది
Advertisement
సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా 'ప్రతీరోజూ పండగే' సినిమా రూపొందుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. యూవీ క్రియేషన్స్ .. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

ఈ నెల 4వ తేదీ(సోమవారం) ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టు సింగిల్ తోనే అంచనాలు పెరిగేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామీణ నేపథ్యంలో .. బంధాలు - అనుబంధాలు చుట్టూ అల్లుకున్న అందమైన కథ ఇది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో తేజు వున్నాడు. ఇక దర్శకుడు మారుతికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమే. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
Sat, Nov 02, 2019, 04:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View