యూట్యూబ్ లో దూసుకుపోతున్న 'గద్దలకొండ గణేశ్' రీమిక్స్ సాంగ్
Advertisement
ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గద్దలకొండ గణేశ్' చిత్రం వరుణ్ తేజ్ కి మంచి హిట్ తెచ్చిపెట్టింది. గతంలో శోభన్ బాబు - శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మా' పాటను ఈ సినిమాలో వరుణ్ తేజ్ .. పూజా హెగ్డే పై చిత్రీకరించారు. అప్పట్లో చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి ఈ పాటను నిన్న యూట్యూబ్ లో విడుదల చేశారు.

ఒకే ఒక్క రోజులో ఈ పాట మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. శోభన్ బాబు కెరియర్లోనే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకూ గల ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ జాబితాలో ఈ సాంగ్ కనిపిస్తుంది. హరీశ్ శంకర్ కలర్ ఫుల్ గా .. బ్యూటిఫుల్ గా చిత్రీకరించడం .. పూజా హెగ్డేను మరింత గ్లామరస్ గా చూపించడం ఈ పాటకి ఇన్ని వ్యూస్ లభించడానికి మరొక కారణంగా చెబుతున్నారు. మున్ముందు ఈ పాట ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.
Sat, Nov 02, 2019, 04:08 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View