రాజమౌళి మల్టీ స్టారర్ ముందుగా చెప్పిన సమయానికే వస్తుందట!
Advertisement
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి ఒక భారీ మల్టీస్టారర్ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. మిగతా షెడ్యూల్స్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చేతికి గాయం కావడం వలన కొన్నాళ్లు .. చరణ్ కాలికి గాయమైన కారణంగా కొన్నాళ్లు ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరిగింది. ఇతరత్రా కారణాల వలన అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగలేదనే టాక్ వుంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటి అవకాశమే లేదనే మాట ఈ సినిమా యూనిట్ నుంచి వినిపిస్తోంది. జనవరికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలని అనుకున్నారట. ఒకవేళ మార్చి నాటికి పూర్తయినా, ముందుగా చెప్పినట్టుగా జూలై 30న ఈ సినిమా విడుదల జరిగిపోతుందని చెబుతున్నారు. ఇంకాస్త జాప్యం జరిగినా ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చే రోజు మాత్రం అదేనన్న మాట.
Sat, Nov 02, 2019, 03:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View