భారీ రేటుకు విశాల్ 'యాక్షన్' సినిమా హక్కులు
Advertisement
తమిళ .. తెలుగు భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రం 'యాక్షన్' .. సుందర్ సి. దర్శకత్వంలో రూపొందింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విశాల్ జోడీగా తమన్నా కనిపించనుంది. రాంకీ .. ఐశ్వర్య లక్ష్మి .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా తెలుగు థియేటర్ హక్కులు 5 కోట్లకి అమ్ముడైనట్టుగా సమాచారం. ఇంతకుముందు తెలుగులో వచ్చిన విశాల్  సినిమాలు 'అభిమన్యు' .. 'డిటెక్టివ్' బాగా ఆడటం, ఇటీవల అనువాద చిత్రాలుగా వచ్చిన 'విజిల్' .. 'ఖైదీ' చిత్రాలకి ఇక్కడ మంచి ఆదరణ లభించడం వలన 'యాక్షన్' సినిమాకి ఈ స్థాయి రేటు పలికిందని చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు.
Sat, Nov 02, 2019, 02:02 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View