పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే.. సినిమా చేస్తున్నారంటూ గుడ్ న్యూస్ చెప్పిన తరణ్ ఆదర్శ్
Advertisement
రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్... త్వరలోనే కొత్త సినిమా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, పవన్ అభిమానులకు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.

'బిగ్ న్యూస్. తమిళంలో బాలీవుడ్ సినిమా 'పింక్'ను రీమేక్ చేసిన బోనీ కపూర్... ఇప్పుడు దిల్ రాజుతో చేతులు కలపారు. 'పింక్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే' అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తరణ్ చేసిన ట్వీట్ తో పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
Sat, Nov 02, 2019, 01:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View